ప్రజల అభివృద్ధికి సమాచారమే పునాది. ముఖ్యంగా స్థానిక సమాచారం సక్రమంగా అందకపోతే ప్రజలు తమ హక్కులు, అవకాశాలు గురించి పూర్తిగా తెలుసుకోలేరు. ‘చిలకలూరిపేట లోకల్ న్యూస్‘ అనే వెబ్‌సైట్‌ ఏర్పాటు చెందింది ఇదే అవసరాన్ని గుర్తించి – చిలకలూరిపేట పట్టణానికి సంబంధించిన వార్తలు, సంఘటనలు, విశేషాలు, ప్రభుత్వ సమాచారాన్ని నిఖార్సైన నిజాయితీతో ప్రజల ముందుకు తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం.

ఈ వెబ్‌సైట్ ఒక వార్తా వేదిక మాత్రమే కాదు – ఇది చిలకలూరిపేట ప్రజల గొంతుక, అనుభూతుల అద్దం, స్థానిక ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు రూపం. చిన్న విషయమైనా సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తే, అది మా వార్తల్లో ప్రాధాన్యత పొందుతుంది. చిన్న వ్యాపారులు, యువత, మహిళలు, ఉద్యోగార్థులు, వృద్ధులు – ప్రతి వర్గానికి ఉపయుక్తమైన సమాచారం అందించాలన్నదే మా సంకల్పం.

ప్రపంచం ఎంత విస్తరించినా, ప్రతి మనిషికి తన ప్రాంతం, తన గడప ముందర జరిగే సంగతులే ముందుగా తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ, చిలకలూరిపేట పరిధిలో జరిగే అనేక కీలకమైన విషయాలు, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ జరిగిన సంఘటనలు ప్రధాన మీడియాలో స్థానం పొందవు. ఈ వెబ్‌సైట్‌ ఆ లోటును భర్తీ చేయడమే లక్ష్యంగా పని చేస్తుంది.

నిజాయితీ, స్పష్టత, నిష్పక్షపాతం – ఈ మూడు ప్రమాణాలను సంక‌ల్పంగా, ఏ ఒక్కరినీ మనస్పర్థులకు గురిచేయకుండా, బాధ్యతాయుతంగా వార్తల అంద‌జేస్తాం. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, సమస్యల పరిష్కార దిశగా పటిష్టమైన సమాచారాన్ని అందించడమే మా బృంద లక్ష్యం.

మీరు చదివే ప్రతి వార్తలో ఒక నిజమైన నిబ‌ద్ద‌త‌, మీ ప్రాంతానికి చెందిన‌ మమకారం ఉంటుంది. ఈ ప్రయాణంలో మాతో పయనించండి. మాతో కదలండి. మన చిలకలూరిపేటకు స‌రైన‌ సమాచారం అందించడంలో భాగస్వాములు కండి.

‘చిలకలూరిపేట లోకల్ న్యూస్’

Share.
Leave A Reply