మాచర్లలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

ఈ సోమవారం (12.05.2025) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను మాచర్ల పట్టణంలో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. సోమవారం ఉదయం 10.00 గం.లకు నెహ్రూ నగర్ లోని వివియన్ గార్డెన్స్ నందు పీజీఆర్ఎస్ ప్రారంభమవుతుందన్నారు.

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నియోజక వర్గాల స్థాయిలో నిర్వహించదలిచామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే చిలకలూరి పేట, నరసరావు పేట నియోజక వర్గాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పుడు మాచర్లలో పీజీఆర్ఎస్ అవకాశాన్ని నియోజక ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Share.
Leave A Reply