ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలి -ఎస్టియు
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు బదిలీలు జరగబోయే నేపథ్యంలో బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నట్లు ఎస్టియు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు ఎస్టియు డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే విధంగా బదిలీలలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు ఉండే విధంగామరియు 120 రోలు దాటిన ప్రతి పాఠశాలకు ఒక పిఎస్ హెచ్ఎం అయిదుగురు టీచర్లు ఉండే విధంగా బదిలీలు నిర్వహించాలని కోరారు, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20 గా నిర్ణయించాలని కోరారు,
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 అర్బన్ లోకల్ బాడీ మున్సిపల్ పాఠశాలలో మున్సిపల్ మేనేజ్మెంట్లో అప్ గ్రేడ్ అయిన స్కూల్స్ మరియు 75/100 రోల్ హై స్కూల్స్ కి హెచ్ఎం మరియు స్కూల్ అసిస్టెంట్లు కేటాయించి దాదాపు 3 వేలకు పైగా ప్రమోషన్లు PSHM,అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్స్ ,హైస్కూల్ హెచ్ ఎం ఇవ్వడాన్ని ఎస్టీయూ స్వాగతిస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఉపాధ్యాయులుహార్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పట్టణ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలో పాఠశాలలు ఏర్పాటు చేయాలని తధానుగుణంగా ఉపాధ్యాయులని సర్దుబాటు చేయాలని కోరారు. మున్సిపల్ స్కూల్స్ పర్యవేక్షణకు అర్బన్ ఎంఈఓ నియమించాలని, మున్సిపల్ స్కూల్స్ నందు ప్రెస్ టు ఏర్పాటు చేయాలని, స్పోస్ ప్రాధాన్యత ఉన్న టీచర్లకు అంతర యాజమాన్య బదిలీలకు అనుమతించాలని కోరారుఎస్ టి యు పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య ఎస్ టి యు పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వి జయప్రకాష్ నాదెండ్ల మండల అధ్యక్షుడు మక్బూల్ బాషా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ ఎడ్లపాడు మండల అధ్యక్షుడు జి కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ చిలకలూరిపేట మండల అధ్యక్షులు బొంత రవి చిలకలూరిపేట మండల ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్వలి ఎస్టియు సీనియర్ నాయకులు చావల మల్లేశ్వరరావు జిల్లా మహిళా కన్వీనర్ ఎం శారద తదితరులు హర్షం వ్యక్తం చేశారు



