చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ఎంఎస్ షాది ఖానా వెనుక వైపున ఉన్న ఈనాడు ఉమర్ లేఔట్ నందు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భాను ప్రసాద్ అన్నారు.
గతంలో పాదాచారులు దాహం వేస్తే ఇళ్లల్లో మంచినీరు అడిగి త్రాగే వారిని నేడు మారుతున్న పరిస్థితుల్లో అటువంటి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. మంచినీటి చలివేంద్రాలు అందుబాటులో ఉండటంవల్ల ఎంతోమంది బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి, పరిసర ప్రాంతాలలో పనుల కోసం వచ్చిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈనాడు ఉమర్ లేఅవుట్ నందు మంచినీటి చలివేంద్రం క్రమం తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట లైసెన్సుడు ఇంజనీర్స్ అండ్ సర్వేయర్స్ అధ్యక్షులు డేవిడ్, ఉపాధ్యక్షులు శ్యామ్, శ్రీనివాస్, ఫిరోజ్, సాయి, ఈనాడు ఉమర్ కుటుంబ సభ్యులు మరియు సాదిక్, బాజీ తదితరులు పాల్గొన్నారు..

Share.
Leave A Reply