బాల్య వివాహాలతో మానసిక, శారీరక సమస్యలు
– ఏసీడీపీవో నిర్మలారాణి
– బోయపాలెం, ఉప్పరపాలెంలో అవగాహన సదస్సు
యడ్లపాడు మండలంలోని బోయపాలెం, ఉప్పరపాలెం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం కిశోరి వికాసం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసిడిఎస్ ఏసీడీపీవో నిర్మలా రాని ముఖ్య అతిథిగా హాజరై పునరుత్పత్తి ఆరోగ్యం, బాల్యవివాహాల కారణంగా కలిగే దుష్ప్రభావాలపై గ్రామస్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మతృ,శిశు మరణాలను తగ్గించేందుకు బాల్యవివాహాలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వలన బాలికల శారీరక, మానసిక పరిస్థితులపై దుప్రభావాన్ని చూపుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ నిర్మలరాణి, సూపర్‌వైజర్ ఎం. జోజమ్మ, ఏఎన్‌ఎం ఏ. జోజి మేరీ, అంగన్వాడీ కార్యకర్తలు షేక్ జరీనా, వివి సుబ్బాయమ్మ, వి.ఆర్. కోటేశ్వరి, ఆశ వర్కర్లు షేక్ మస్తాన్‌బి తదితరులు పాల్గొన్నారు.