పిడుగుపాటుతో మహిళ మృతి – ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పరామర్శ

నరసరావుపేట మండలం నల్లగార్లపాడు పంచాయతీ పరిధిలోని పాలపాడు రోడ్డులో పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గట్ల చిన్నమ్మ (వయస్సు 55) అనే మహిళ దుర్మరణం చెందారు. మృతురాలు భర్త పెద్ద అంకిరెడ్డి భార్య కాగా, వారికి ఒక కుమారుడు ఉన్నారు.

ఈ విషాద ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం తెలిసిన వెంటనే నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Share.
Leave A Reply