ఈ నెల 18 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాలు చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ కార్యదర్శి గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన దేవరకొండ తిరుపతి రాయుడు అభినందనలు తెలిపిన యార్డు సిబ్బంది… ఉద్యోగులు తణుకు నుంచి చిలకలూరిపేట యార్డు కార్యదర్శిగా బదిలీపై వచ్చిన తిరుపతి రాయుడు భాద్యతలు స్వీకరించిన అనంతరం సిటీ న్యూస్ తొ మాట్లాడిన కార్యదర్శి తిరుపతి రాయుడు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని, నియోజకవర్గ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాననితెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆదేశాల కు అనుగుణంగా అభివృద్ధి కి సహకరిస్తానని, గ్రామాల్లో లింక్ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ నెల 18 నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కు చర్యలు తీసుకుంటామని చెప్పారు
Author: chilakaluripetalocalnews@gmail.com
చేనేత కార్మికుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మాజీమంత్రి ప్రత్తిపాటి. చేనేత దౌలిశాఖ నుండి చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని చేనేత కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లో భాగంగా మినీ క్లస్టర్ లో 93 లక్షల రూపాయలు మంజూరు అయ్యింది. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ మాజీమంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విధివిధానాలు, దానికి సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించటం కోసం ప్రత్తిపాటి పుల్లారావు గారితో అధికారులు చర్చించారు. అతి త్వరలోనే నియోజకవర్గంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసేలా చూడాలి అని ప్రత్తిపాటి అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో జనసేన ఇన్చార్జి తోట రాజారమేష్, నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్, మద్దుమల రవి, కందుల రమణ, గంజి శ్రీనివాసరావు, అవ్వారు…
ప్రగడ రాజమోహన్ మృతి గత 40 సంవత్సరాలు నుంచి చిలకలూరిపేట కళానిలయం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సాంస్కృతిక పోటీలు ఏర్పాటు చేస్తారు. ఆయన మృతి చిలకలూరిపేట కళానిలయం కు తీరని లోటు ప్రగడ రాజమోహన్ PR మోహన్ గా అందరికి సూపరిచితుడు 87సంవత్సరాల PR మోహన్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. గత కొన్ని నెలలు గా ఆయనకు ఆరోగ్యం బగోలేదు….నివాస గృహంలో నే తుదిశ్వాస విడిచారు
నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులని సత్కరించిన ప్రత్తిపాటి…. నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నార్నె కోటయ్య స్వామి గారు, ప్రధాన కార్యదర్శి గా కోట మహేష్ గారు మరియు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ వారిని దుస్సాలువతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియచేసిన ప్రత్తిపాటి…ఈ కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మదన్, బండారుపల్లి సత్యం, వలేటి హిమంత్, నందిగం శివకోటేశ్వరరావు, నార్నె శ్రీనివాసరావు, ఐనవోలు రాధా, జంపని వసంతరావు, కమ్మ శ్రీనివాసరావు, చెన్నబోయిన సుబ్బారావు, మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు…
పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగాచిలకలూరిపేటనియోజకవర్గం బిజెపి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చంధవరం గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు అమ్మకు ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా చంధవరం గ్రామంలో మొక్కలు నాటడం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ కన్వీనర్ మాజీ నాదెండ్ల మండల అధ్యక్షులు ఆళ్ళ శివకోటిరెడ్డి కో కన్వీనర్ నాగండ్ల వీరయ్య తదితరుల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి మల్లెల శివ నాగేశ్వరరావు ప్రోగ్రాం పల్నాడు జిల్లా కన్వీనర్ బండారు నాగరాజు ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురు స్వామి బిజెపి సీనియర్ నాయకులు నల్లమోతు రంగారావు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చెరెడ్డి విజయభాస్కర్ రెడ్డి బిజెపి నాయకులు మెట్టు వెంకటరమణారెడ్డి దుగ్యంపూడి అశోక్ రెడ్డి బీజేపీ మహిళా నాయకురాలు చేకూరి అన్నపూర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో…
నేడు ఏరువాక పౌర్ణమి…!! “ ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా…నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా…” ఈ పాట తెలియని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు, కానీ ఈ పాటలో “ ఏరువాక” అనే పదానికి అర్ధం చాల మందికి తెలియకపోవచ్చు… “ఏరు” అంటే… ఎద్దులను కట్టి దుక్కి దున్నుటకు సిద్దపరచిన నాగలి. “ ఏరువాక”… అంటే దుక్కి దున్నుట ప్రారంభం. అంటే వ్యవసాయ ప్రారంభం. పొలంలో పంట పండి చేతికి వస్తేనే కదా మన కష్టాలు తీరేది.ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధానదేశం. అందుకే మన దేశంలో వ్యవసాయాన్ని ఓ పవిత్రకార్యంలా, తపస్సులా చేస్తారు.. ఇక్కడి రైతాంగం. దేశాన్ని సస్యశ్యామలం చేసి, మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి, భూమాత. అట్టి తల్లి గుండెలపై నాగలి గ్రుచ్చి, దుక్కి దున్నడం రైతన్నకి బాధాకరమైన విషయమే అయినా , బ్రతకాలంటే దుక్కి దున్నక తప్పదు కదా! అందుకని, వ్యవసాయ ప్రారంభానికి ముందు,…
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు చేతుల మీదుగా “షైనింగ్ స్టార్” అవార్డు.. కేజీబీవీ విద్యార్థిని షీక్ నాగూర్..1000 మార్కులకు గాను 926 మార్కులు 20వేల చెక్ అందుకున్న విద్యార్థిని.. చిలకలూరిపేట: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో పేట రూరల్ పరిధిలోని పోతవరం కేజీబీవీ విద్యార్థిని షీక్ నాగూర్ షర్మీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.1000 మార్కులకు గాను 926 మార్కులు సాధించి గొప్ప విజయాన్ని అందుకుంది.షర్మీకి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా “షైనింగ్ స్టార్” అవార్డు లభించింది.ఈ విజయం ఆమె కృషికి, పట్టుదలకు నిదర్శనం. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ షేక్.అషరీఫున్ మాట్లాడుతూ విద్యారంగంలో మెరిట్ సాధించిన పేద విద్యార్థులను ప్రోత్సహించేలా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావులకే దక్కుతుందన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించటం సరికొత్త అధ్యాయమన్నారు. కేజీబీవీ పోతవరం…
చారిత్రక కొండవీడులో యోగా మహోత్సవం యడ్లపాడు మండలంలోని చారిత్రక కొండవీడుకోటలో బుధవారం యోగాంధ్ర కార్యక్రమం అధికారులు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకుని శారీరక, మానసిక ఆరోగ్యానికి దివ్య ఔషధమైన యోగా ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ తెలిసేలా జిల్లా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రచించారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర – 2025 పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 100 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో, చారిత్రక ప్రాంతాల్లో యోగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం, ప్రజల్లో ఆరోగ్య స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా అధికారులు పిల్లల నుంచి వద్ధుల వరకు అవగాహన కల్పిçస్తూ..జిల్లా వ్యాప్తంగా యోగాపై వివిధ రకాల పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో మంగళవారం…
చిలకలూరిపేటలో వార్డుల్లో వీధిలైట్ల మరమ్మతులు: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో చర్యలుచిలకలూరిపేట పట్టణంలోని 29వ వార్డు పీర్ల మన్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు వెలగని వీధిలైట్లను గుర్తించి, వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.మున్సిపల్ సిబ్బందితో కలిసి వెలగని లైట్లను గుర్తించిన కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, వెంటనే వాటిని రిపేరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం లేదా లైట్ల లోపాలు తలెత్తడం వల్ల పలుచోట్ల వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను, సంబంధిత వార్డు కౌన్సిలర్‌ను ఆదేశించారు. పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు, కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి చురుకుగా వ్యవహరించి, పీర్ల మన్యం ప్రాంతంలోని వెలగని…
బహిరంగ వేలం నోటిసు చిలకలూరిపేట పురపాలక సంఘమునకు సంబందించిన షాపింగ్ కాంప్లెక్స్ అయినటువంటి శ్రీ ప్రకాశం బిల్డింగ్ -2 మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి పాపురూము నెం. 18, 19 మరియు 22, 25 (జనరల్ కేటగిరి), శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ షాపురూము నెం. 15 (జనరల్ కేటగిరి), IDSMT-B BLOCK-1 (జనరల్ కేటగిరి) శ్రీ గాంధీ పార్క్ దక్షిణం వైపు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ షాపురూము నెం. 1,3, 16, 18, మరియు 19 (జనరల్ కేటగిరి) శ్రీ గాంధీ పార్క్ ఉత్తరం వైపు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపురూము నెం. 2,7,9,10, 11, 12 మరియు 13 (జనరల్ కేటగిరి), శ్రీ వడ్డే నాగేశ్వరరావు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపురూమునెం. 1,3 మరియు 8 (జనరల్ కేటగిరి), శ్రీ సోమేపల్లి సాంబయ్య మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపురూమునెం. 6 (D)…