రేషన్ షాపులను తనిఖీ చేయండి జిల్లా జాయింట్ కలెక్టర్ పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్, పల్నాడు వారు జిల్లా లోని పౌర సరఫరాల డిప్యూటీ తహసిల్దార్లు మరియు LPG డిస్ట్రిబ్యూటర్ ల తో “రేషన్ కార్డుదారుల IVRS CALLS నందు రేషన్ పంపిణీ పై వ్యతిరేకత వ్యక్తం చేసియున్న మరియు దీపం-2 లబ్దిదారుల నుండి డెలివరి బాయ్స్ రసీదు లో ఉన్న రేటు కంటే ఎక్కువగా వసూలు చేయుట మరియు వారితో దురుసుగా ప్రవర్తించుట గురించి డా., బి.ఆర్. అంబేద్కర్ (PGRS) హాలు నందు సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశము నందు శ్రీయుత జిల్లా జాయింట్ కలెక్టర్ వారు మాట్లాడుతూ జిల్లాలో రేషన్ పంపిణీ విషయమై కార్డుదారులకు రేషన్ పంపిణీ సరిగా చేయడం లేదని, డీలర్లు కార్డుదారులతో దురుసుగా సమాధానం చెబుతున్నారని IVRS ద్వారా ఫిర్యాదులు అందియున్నవని, వాటిని పునరావృతం రాకుండా డిప్యూటీ తహసిల్దార్లు ప్రతి రేషన్ షాపును తనిఖీ…
Author: chilakaluripetalocalnews@gmail.com
వ్యవసాయ భూముల్లో యదేచ్చగా మట్టి దోపిడి. అధికారం లేకపోయినా… నాయకుల తీరు మారలేదు. తాహసిల్దార్ కు రైతుల వినతి. చిలకలూరిపేట.మండలంలోని మురికిపూడి గ్రామంలో భూ బకాసురులు ప్రతినిత్యం ఎవరు ఆదమరుస్తురో ఎక్కడ వ్యవసాయం చేయకుండా ఖాళీగా కనపడుతుందా అని గ్రామమంతా నిఘానేత్రంతో చూస్తుంటారు. గత ప్రభుత్వం హయాంలో మంత్రి విడదల రజిని అనుచరుడు బినామీ ఆరుమళ్ళ వెంకట శివ, గ్రామ సర్పంచ్ భర్త ఉసత్రి రాంబాబు గ్రామంలో మాజీ మంత్రి విడదల రజిని అనుచరులుగా ఉంటూ అనేక దందాలు అనేక భూస్కాముల్లో ప్రధాన వ్యక్తులుగా ఉన్నారు. వీరిపై హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి.ప్రభుత్వం మారినా.. వీరు తీరు మారలేదు, గుట్టు చప్పుడు కాకుండా వీరి పనులు యాదేచ్చుగా కొనసాగించుచున్నారు. ప్రవేట్ వెంచర్లకు మట్టి తోలకాలకు క్రొత్త, పాత చెరువులోని మట్టిని అమ్మకాలు జరిపారు. పట్టా భూములను సైతం లెక్కచేయకుండగా అందులోను మట్టి తీసి అమ్ముకుంటున్నారు.గ్రామ సర్పంచ్ భర్త అవడం వల్ల…
సీఎం.ఆర్.ఎఫ్ సాయం వేలమంది ప్రాణాలు కాపాడింది. : ప్రత్తిపాటి అత్యవసర వైద్య చికిత్సలు అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం ఎంతగానో ఉపయోగపడుతోందని, ఇప్పటికే వేలమంది ప్రాణాలు కాపాడిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం తన నివాసంలో ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల్ని ప్రత్తిపాటి లబ్ధిదారులకు, అనారోగ్యబాధితుల కుటుంబసభ్యులకు అందించారు. 43 మంది లబ్ధిదారులకు రూ.24.13 లక్షల విలువైన చెక్కుల్ని స్వయంగా అందచేసిన ప్రత్తిపాటి లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలు… తీవ్రమైన జబ్బులు… ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం.ఆర్.ఎఫ్) సాయం కొత్త వెలుగులు నింపుతోందని ప్రత్తిపాటి చెప్పారు. ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాల్లోని వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఖరీదైన వైద్యసేవలు అందిస్తున్న కూటమిప్రభుత్వంపై ప్రజలు చెక్కుచెదరని విశ్వాసంతో ఉండాలని ప్రత్తిపాటి సూచించారు. చంద్రబాబు ఆపత్కాలంలో సదా ప్రజలవెన్నంటి నిలుస్తున్నారని, అటువంటి…
నేటి నుండి శ్రావణ మాసం ప్రారంభం.. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం , సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు.అంత గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు , విశిష్ట పండుగలు రానున్నాయి.సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటింది శ్రావణమాసం.ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు ,శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు.వివిధ రకాల పూజలు , వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం…
అంకిరెడ్డి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో మల్లెల శివ నాగేశ్వరావు కు ఘన సన్మానం చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ప్రాంతీయ కార్యాలయంలో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మల్లెల శివ నాగేశ్వరావును ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాయకులు అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర బృందం అందరూ మల్లెల శివ నాగేశ్వరావును పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ఘనంగా సన్మానించడం జరిగింది
నూతన కమిటీని ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు పల్నాడుజిల్లా బిజేపి ఉపాధ్యక్షులు గా మల్లెల శివ నాగేశ్వరావు, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్టా హేమ కుమార్ పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా చిలకలూరిపేట నియోజకవర్గం లోని చిలకలూరిపేట పట్టణానికి చెందిన మల్లెల శివ నాగేశ్వరరావు ను, పల్నాడు జిల్లా సెక్రెటరీ గట్టా హేమ కుమార్ ని నియమించినట్లు మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా మల్లెల శివ నాగేశ్వరరావు ను, గట్టా హేమ కుమారు ను పలువురు అభినందనలు తెలియజేసారు. బిజెపి పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమాల ను నిర్వహిస్తున్నానని, నేను నమ్మిన పార్టీ సేవ చేయడం అంటే నా దేశానికి సేవ చేస్తున్నట్లుగా భావిస్తానని, అలాగే పల్నాడు జిల్లా లో పార్టీ ని మరింతగా బలోపేతం…
పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మల్లెల శివ నాగేశ్వరరావు ను ఘనంగా సన్మానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంఘంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో బిజెపి పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరావు ఘనంగా సన్మానించిన కాపు సంఘం నాయకులు సన్మానించిన కాపు నాయకులందరూ మరెన్నో పదవులు అధిరోహించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులు గోవింద శంకర్ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు కార్యదర్శి జగ్గాపురం రామారావు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల వెంకటేశ్వర్లు జనసేన నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆముదాల లీలా కిషోర్ సనాతన కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రత్తిపాటి గట్టిగా దృష్టి పెడితే రజనీ జైలుకెళ్లడం ఖాయం రజనీ, ఆమె అనుచరులు ఒళ్లుదగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది : పిల్లి కోటి (నియోజకవర్గ ఐ-టీడీపీ కోఆర్డినేటర్) “ నియోజకవర్గ వైసీపీనాయకులు పిచ్చెక్కి, మతి భ్రమించి మదమెక్కి మాట్లాడుతున్నారు. వారంతా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టయితే మేం స్వయంగా చందాలు వేసుకొని వారి చికిత్సకు సహకరిస్తాం. రజనీ వ్యాఖ్యలు వింటుంటే నవ్వొస్తోంది. తన ఇల్లు భారీస్థాయిలో నిర్మించుకొని, ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రిని రజనీ గాలికి వదిలేశారు. చివరకు ఆసుపత్రుల నుంచి కమీషన్లు వసూలుచేసిన ఘనత ఆమెది.. ఆమె మరిదిది. తన మరిది జైల్లో ఉంటే పరామర్శకు కూడా వెళ్లని మనిషి రజనీ. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటివరకు ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా ప్రత్తిపాటి… టీడీపీ ప్రభుత్వాలు చేసిందే. రజనీ ఇకపై హద్దులు మీరి మాట్లాడితే, ఆమె నాలుక తెగ్గోయడానికి కూడా వెనుకాడం. పగలు ఒకపార్టీలో.. రాత్రి మరో పార్టీలో కొనసాగే…
30 లక్షల రూపాయల ఖర్చుతో శాశ్వత తాగునీటి పైపులైన్ల పనులను ప్రారంభించిన కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ చిలకలూరిపేట నియోజకవర్గం, లింగంగుంట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీమంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ పాల్గొన్నారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి సుభాష్, కృష్ణ తేజ, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ఏ ఒక్కరికైనా కొన్ని అనివార్య కారణాలతో సూపర్ సిక్స్ పథకాలు రావడం లేదని నాయకుల దృష్టికి కానీ నా దృష్టికి గాని తీసుకువస్తే వారికి ఆ పథకాలు ఎందుకు రావడం…
మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలపై కౌన్సిల్ ల్లో పరస్పర చర్చలు. కోర్టులకు లోబడి పని చేస్తాం: మున్సిపల్ కమిషనర్. విలీన గ్రామాలపై అర్జీల రూపంలో తెలియజేయండి: మున్సిపల్ చైర్మన్. అభివృద్ధి పరంగా నష్టపోతున్నాం: వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు. ఆనాడు విలీనమైన గ్రామాలపై మాట్లాడితే సహించలేదు.. ఈనాడు ఏలా మాట్లాడుతున్నారు. టిడిపి ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు. మున్సిపాలిటీలో విలీనమైన పసుమర్రు గణపవరం మానుకొండ వారి పాలెం గ్రామాల ప్రజలు అభివృద్ధి జరగక నష్టపోయారని మునిసిపల్ వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు,మున్సిపల్ చైర్మన్ రఫానీల మధ్య శుక్రవారం జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో పరస్పర చర్చలు జరిగాయి. స్థానిక మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలులో కౌన్సిల్ సమావేశం జరిగింది.కౌన్సిల్ అజెండా చదవక ముందే పట్టణంలోని ఆక్రమణలు తొలగించాలని వైసీపీ కౌన్సిలర్ వి.కోటా నాయక్ కోరారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సమాధానం ఇచ్చారు. పట్టణంలో ని…









