Author: chilakaluripetalocalnews@gmail.com

నియోజకవర్గ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ప్రత్తిపాటి గత పాలకుల అసమర్థ పాలనతో నియోజకవర్గం అభివృద్ధికి దూరమైందని, చివరకు ప్రజలకు సురక్షితమైన తాగునీరు కూడా అందించలేకపోయారని, కూటమి ప్రభుత్వ కృషితో త్వరలోనే ప్రజలకు కృష్ణా జలాలు అందనున్నాయని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యడ్లపాడు, చిలకలూరిపేట మండలాల్లో శనివారం ప్రత్తిపాటి పలు అభివృద్ధి పనుల ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, తొలుత యడ్లపాడు మండలం సందెపూడి ఎస్సీ కాలనీలో రూ.35 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం చిలకలూరిపేట మండలం వేలూరులో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, పాఠశాల ప్రహరీలను ఇరువురు నాయకులు ప్రారంభించారు. అనంతరం రూ.40 లక్షలతో నిర్మించే సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చివరిగా మానుకొండవారిపాలెంలో రూ.40 లక్షల నిధులతో నిర్మించిన మంచినీటి ఓవర్…

Read More

మున్సిపల్ ఎన్నికల వేళ చిలకలూరిపేటలో పోలీసుల భారీ సాయుధ కవాతు భయపడకుండా ఓటు వేయాలన్న టౌన్ సిఐ పి రమేష్ పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాలతో 150 మంది ప్రత్యేక బలగాలతో రూట్ మార్చ్.. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత! చిలకలూరిపేట:రాబోవు మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు మరియు ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ధైర్యం కల్పించేందుకు పోలీసులు భారీ సాయుధ కవాతు నిర్వహించారు.పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాలు మరియు సూచనల మేరకు, చిలకలూరిపేట టౌన్ సిఐ పి. రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం (09.10.2026) సాయంత్రం 150 మంది ప్రత్యేక బలగాలతో ఈ కవాతు సాగింది.పట్టణంలోని NRT సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ సాయుధ కవాతు, చౌత్రా సెంటర్, కళామందిర్ సెంటర్ మీదుగా అడ్డరోడ్డు వరకు సాగింది.…

Read More

ప్రధాని నరేంద్ర మోది జన్మదిన సందర్భంగా ‘సేవా సంకల్ప’ కార్యక్రమం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు ​పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని RVSCS హైస్కూల్‌లో ప్రధాని శ్రీ నరేంద్ర మోది పుట్టినరోజు పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాము. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.​గెలుపొందిన విద్యార్థులకు మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా మొదటి, రెండవ, మూడవ బహుమతులు (షీల్డులు) అందజేయడం జరిగింది.​ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు , మాజీ పల్నాడు జిల్లా నెల్లూరు ఈశ్వర్ రంజిత్ , పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ , ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య , బిజెపి నాయకులు కూటమి నాయకులు, RVSCS హైస్కూల్ సుధాకర్ మాస్టర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ఆఫీస్ ఇంచార్జి చిరంజీవి గారు నరసరావుపేట బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Read More

మోదీ నాయకత్వంలో సరికొత్త అభివృద్ధి సంక్షేమంతో భారత కీర్తి విశ్వవ్యాప్తమైంది : ప్రత్తిపాటి 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు ప్రధాని మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై నేటి యువత ఆలోచన చేయాలని, ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచగురువుగా మారిన తీరుని ఒక పాఠ్యాంశంగా అధ్యయనం చేయాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. గురువారం చిలకలూరిపేట పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన సేవా జ్యోతి యాత్ర బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పాల్గొన్నారు. ఎన్.ఆర్.టీ కూడలి నుంచి రిజిస్త్రార్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో ఆయన హుషారుగా బుల్లెట్ నడిపి, కూటమి శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. అనంతరం ప్రత్తిపాటి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. 25 ఏళ్ల ప్రజాసేవ.. సామాన్య విషయం కాదు..ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా 25 ఏళ్లు నిర్విరామంగా ప్రజలకు, దేశానికి సేవలు అందించడం సామాన్య విషయం కాదని, ఈ అంశంలో…

Read More

చిలకలూరిపేటలో బహిరంగంగా మద్యం సేవించిన 14 మందికి రూ.14 వేల జరిమానా చిలకలూరిపేట: చిలకలూరిపేట పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 14 మందిపై పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిని చిలకలూరిపేట కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ మహబూబ్ సుభాని ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. దీంతో 14 మందికి కలిపి మొత్తం రూ.14,000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Read More

ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోండి: రేపటి నుండి BLOల ఇంటింటి పర్యటన! ​”ప్రతి అర్హత కలిగిన ఓటరుకు చోటు… అనర్హుల తొలగింపే ECI లక్ష్యం!” ​”మీ పేరు పొరపాటున తొలగించబడిందా? రేపే ఫారం-6 నింపి ఓటరుగా నమోదు చేసుకోండి!” ​”సరైన ఓటరు జాబితా – భాగస్వామ్య ప్రజాస్వామ్యం!” 96-చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ముఖ్యాంశాలు: ​భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా, 96-చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైంది. ​🔹 ముఖ్యమైన అంశాలు: ​ బి. లీలా రాణి,ఓటర్ల నమోదు అధికారి, 96-చిలకలూరిపేట నియోజకవర్గం.

Read More

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసు రత్నం నరసరావుపేట బీజేపీ నాయకులు సంపత్ కుమార్ గారు చిలకలూరిపేట పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య గారుపల్నాడు జిల్లా బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికీ సమర్పిస్తున్న పిర్యాదు విషయం: జిల్లాలో సమగ్ర “కాలుష్య నివారణ కార్యాచరణ ప్రణాళిక” Comprehensive “Pollution Prevention Action Plan” ను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున వినతి. భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసేందుకు ప్రతి శుక్రవారం “జనతా వారధి”…

Read More

కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి (APJPS) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… చిలకలూరిపేట పట్టణంలోని మెడికల్ హాల్ నందు కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి (APJPS)వారి ఆధ్వర్యంలో పాత్రికేయుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారం మరియు హక్కుల సాధన లక్ష్యంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని సీనియర్ రిపోర్టర్స్ దార్ల బుజ్జి బాబు, షేక్ అల్లాబక్షు, మురికిపూడి ప్రసాద్ గార్లను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నీతిగా నిజాయితీగా రాసేటటువంటి వార్తలో నిజం ఉంటే అందరూ మీకు అండగా ఉంటారు. బ్లాక్మెయిలింగ్ కోసం రాసే వార్త కోసమే అయితే సమాజం అండగా ఉండదు పోలీసులు బెదిరింపులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం రాసే వార్తలో సత్యం ఉండాలి పదిమందికి ఆ వార్త ద్వారా…

Read More

గాంధీ జయంతి సందర్భంగా మాంసపు దుకాణాలు బంద్ కఠిన చర్యలు తప్పవన్న కమిషనర్ పి శ్రీహరి బాబు చిలకలూరిపేట పట్టణంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ పరిధిలోని మాంసపు దుకాణాలు, మాంసాహారం విక్రయించే రెస్టారెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమాంసం విక్రయాలు నిలిపివేయాలని ఇప్పటికే సంబంధిత వ్యాపారులందరికీ ముందస్తు నోటీసులు అందజేశామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిచినా, మాంసం అమ్మకాలు చేపట్టినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పి. శ్రీహరి బాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గాంధీ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.

Read More