Author: chilakaluripetalocalnews@gmail.com

శ్రీ దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం పురస్కరించుకొని శ్రీ దత్త స్వామికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం మహిళా భక్తుల సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయికి హారతులు సమర్పించి ప్రదక్షిణలు చేసినారు అనంతరం వేములకొండ సుబ్బారావు గారి ఆర్థిక సహకారంతో వారి మనవడు చిన్మయి సహకారంతో భక్తులకు అన్నసంతర్పణగా జరిగింది అనంతరం ట్రస్టు నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గురుపౌర్ణమి రోజు జరిగే అన్నసంతర్పణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ధన కనక వస్తు వాహన రూపం లో సహకరించాలని కోరారు , గురుపౌర్ణమి రోజున ఉదయం నుంచి ప్రత్యేక…

Read More

డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూగత నెల రోజులుగా జరిగిన డీఎస్సీ పరీక్షలు నిన్నటితో ముగిసినందున నియామకాలు వీలైనంత త్వరగా చేపట్టాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుతున్నట్లు ఎస్టీ యూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జూన్ నెలలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో డీఎస్సీ ఖాళీలు కూడా చూపించి నందు వలన మారుమూల ప్రాంతాలలో ఎక్కువ ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడ్డాయి. డీఎస్సీ పరీక్షలు నిన్నటితో ముగిసినందున వీలైనంత త్వరగా మెరిట్ లిస్టు విడుదల చేసి తద్వారా సెలెక్షన్ లిస్టు తయారు చేసి వెంటనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఉపాధ్యాయ నియామక చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పాఠశాల విద్యాశాఖను కోరినట్లు ఎస్టియు నాయకులు తెలిపారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసిన లక్షలాదిమంది ఉద్యోగులు నిరీక్షిస్తున్నందున…

Read More

ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి. నియోజకవర్గంలోని వాగుల్ని ఆధునికీకరించి, వ్యవసాయానికి కీలకమైన లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థల్ని బాగుచేయాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రికి విన్నవించానని, ప్రభుత్వం సకాలంలో స్పందించి వాగుల్లోని కంపచెట్లు, పూడికతీతకు రూ.2.50కోట్లు కేటాయించిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా ప్రత్తిపాటి గురువారం చిలకలూరిపేట మండలం పసుమర్రులో పర్యటించారు. స్థానిక పశువైద్యశాలలో నట్టల నివారణ మందు.. పశుగ్రాస విత్తనాల పంపిణీ ప్రారంభించిన అనంతరం, స్వయంగా ఎక్సకవేటర్ నడిపి ఓగేరు వాగు ఆధునికీకరణ పనుల్ని ప్రత్తిపాటి ప్రారంభించారు. అనంతరం గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని.. గత పాలకులుచేసిన విధ్వంసాన్ని మర్చిపోతే ఎలాగన్న ప్రత్తిపాటి… ప్రజలు నేడు ప్రశాంతంగా తమ పనితాము చేసుకుంటూ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తూ, హాయిగా ఉండటానికి కారణం కూటమిప్రభుత్వం చంద్రబాబు నాయకత్వమేనన్నారు. ఆగస్ట్ 15 తర్వాత…

Read More

కాపుల చిరకాల వాంఛ అయిన బీసీ రిజర్వేషన్ కోసం చిత్తూరు నుండి అమరావతి వరకు పాదయాత్ర ప్రముఖ విలేఖరి కాపు నాయకులు యువకుడు సానా ప్రసాద్ కూటమి ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్ గురించి గుర్తు చేయడానికి అలాగే రిజర్వేషన్ అమలు చేయటానికి విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి సానా ప్రసాద్ ఎన్నో వ్యాయ ప్రయాసలకు ఓర్చుకొని తన ఆర్థిక స్తోమతను లెక్కచేయకుండా చిత్తూరు నుండి కడప కర్నూలు ఒంగోలు మీదగా చిలకలూరిపేటకు విచ్చేయడం జరిగింది. చిలకలూరిపేటకు విచ్చేసిన సానా ప్రసాద్కు ఘనస్వాగతం తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నాయకులు తాను చేస్తున్న ఈ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేసి చిలకలూరిపేటలో ఉన్న కీర్తిశేషులు వంగవీటి మోహనరంగా విగ్రహాలకు పూలమాలలు వేసి తాను చేస్తున్న పోరాటం గురించి చిలకలూరిపేట కాపు నాయకులకు యువకులకు మహిళలకు తన పాదయాత్ర ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు సానా ప్రసాదు తన మిత్ర బృందం…

Read More

శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ గారి తనయుడు మర్రి శ్రీనాథ్ గారి జన్మదిన సందర్భంగా పట్టణంలోని బాపూజీ వృద్ధాశ్రమం నందు మర్రి సైన్యం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ గారి అభిమానులు, పలువురు ప్రముఖ సీనియర్ నాయకులు పాల్గొని జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ఫోన్ ద్వారా శ్రీనాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు, సోమేపల్లి వాసు గారు,గేరా లింకన్ గారు, బైరా వెంకట కోటి గారు , గొట్టిపాటి సాంబశివరావు గారు,AVM సుభాని గారు, మాజేటి నరేంద్ర గారు, వేజర్ల కోటేశ్వరరావు గారు, ఇమ్మడి జానకిపతి గారు, జాలాది సుబ్బారావు గారు, గడిపూడి దశరథ రామయ్య గారు, నార్నె హనుమంతరావు గారు, చింతల సింగయ్య గారు, జంజనం వెంకటరావు గారు, సయ్యద్ జమీర్ గారు, కొండెబోయిన ఆంజనేయులు గారు, షేక్ కరీముల్లా గారు,గ్రంధి…

Read More

జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత చిలకలూరిపేట 26వ వార్డులోని తిరుపతమ్మ గుడిలో సేవ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వృద్ధురాలి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. చరణ్ తేజ పేరు మీద తమ సొంత నిధులతో జనసేన నాయకులు బియ్యం, నిత్యావసర వస్తువులు, మరియు ఆర్థిక సహాయం అందజేశారు. జనసేన యువనాయకులు మండల నేనిచరణ్ తేజ పేరు మీద చేపట్టిన రెండో సేవా కార్యక్రమం అని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో 26వ వార్డు జనసేన నాయకులు పీఎస్ఆర్, మీసాల రాజు, మీసాల లక్ష్మణ్, ఉపేంద్ర, బొంతు రామారావు, సంతు తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Read More

యోగాంధ్ర‌తో ప్ర‌పంచ రికార్డుయోగ ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో భాగం కావాలియోగ దినోత్స‌వంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాలిజ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజిచిల‌క‌లూరిపేట‌:యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని.. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జన‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి అన్నారు. గురువారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జారోగ్యానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని వివ‌రించారు. ఇందులో భాగంగానే ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నివిశాఖపట్నం కేంద్రంగా,రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నార‌ని, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా పలు ప్రపంచ రికార్డులు సాధించడం తోపాటు ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కూడా పాల్గొన‌టం విశేష‌మ‌న్నారు.యోగ‌సాధ‌న‌తో గిన్నిస్ రికార్డు..జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని బాలాజి చెప్పారు.ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.…

Read More

వినియోగదారుల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించిన తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో గురువారం తాసిల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ ను సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశా రు . ఈ సందర్భంగావినియోగదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తాసిల్దార్ తో చర్చించారు . వినియోగదారుల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్లు డెలివరీ లోపాలు, పెట్రోల్ బంకులలో వినియోగదారులకుజరుగుతున్న సౌకర్య లోపాలు తదితర అంశాలపై తహసిల్దార్ తో విపులంగా చర్చించి నట్లు తెలిపారు .. సమస్యలను పరిష్కరించాలని తాసిల్దార్ ను కోరడం జరిగిందని, తాసిల్దార్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు… అనంతరం వినియోగదారుల హక్కుల పోస్టర్ ను తహసీల్దార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రవి నాయక్ కోశాధికారి బేబీ విక్రమ్, కార్యదర్శి పోలయ్య తదితర నాయకులు…

Read More

పల్నాడు పర్యటనలో ఆంక్షలు ఉల్లంఘన .. ఎస్పీ కీలక వ్యాఖ్యలు జగన్ పల్నాడు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘనలు నిబంధనల ఉల్లంఘనలపై కీలక వ్యాఖ్యలు చేసిన పల్నాడు ఎస్పీ లీగల్ ఒపీనియన్ తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నిన్న పర్యటించిన విషయం విదితమే. జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టర్లను ప్రదర్శించాయి. పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పర్యటన సాగింది. జగన్ జిల్లా పర్యటనపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పల్నాడు పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇవ్వగా, ఆంక్షలకు పూర్తి విరుద్ధంగా కార్యక్రమం జరిగిందని ఎస్పీ తెలిపారు. పోలీసులపై ప్రజా ప్రతినిధులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఏర్పడ్డాయని,…

Read More

పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్‌ల రికవరీ, బాధితులకు అందించిన : అర్బన్ సిఐ రమేష్ చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పోగొట్టుకున్న 11 సెల్ ఫోన్‌లను పేట అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విజయవంతంగా రికవరీ చేశారు. ఈరోజు, పేట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి. రమేష్ రికవరీ చేయబడిన ఈ సెల్ ఫోన్‌లను వాటిని పోగొట్టుకున్న బాధితులకు అప్పగించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ, సెల్ ఫోన్‌లు పోగొట్టుకున్న వెంటనే బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల వాటిని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సైబర్ క్రైమ్ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఫోన్‌లను గుర్తించడం జరిగిందని, ప్రజలు తమ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.పోగొట్టుకున్న తమ సెల్ ఫోన్‌లను తిరిగి పొందిన బాధితులు పోలీస్ అధికారులకు, ముఖ్యంగా ఇన్‌స్పెక్టర్ రమేష్ కి మరియు వారి బృందానికి తమ…

Read More